కృష్ణా డెల్టాకునీరిచ్చేదాకా పోరాటం ఆగదు: చంద్రబాబు

విజయవాడ: కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేవరకు తమ పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరిలో పర్యటించేందుకు గన్నవరం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు దస్త్రాలను స్పీకర్‌ ఎదుటు ఉంచాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదని అన్నారు. జలయజ్ఞంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరినా సమాధానం లేదని విమర్శించారు.