కేంద్రం పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని నిరసన

భువనగిరి టౌన్ (జనం సాక్షి  ):–భువనగిరి పట్టణంలోని   అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జి బండారు రవి వర్ధన్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది,జిల్లా ఇన్చార్జ్  మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా నిత్యవసర ధరలను మరియు గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడానికి దుయ్యబట్టారు. జిల్లా మహిళా కన్వీనర్ పసునాది సంతోష  మాట్లాడుతూ పేద ప్రజలపై వంట గ్యాస్ ధరలు పెంచి మరింత భారం కేంద్ర ప్రభుత్వం మోపిందని నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని BSP డిమాండ్ చేస్తుంది,ఈ కార్యక్రమానికి BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు, బహుజన్ సమాజ్ పార్టీసీనియర్ నాయకులు బట్టు రామచంద్రయ్య,వడ్డేపల్లి దాసు, ఆలేరు అసెంబ్లీ ఇంచార్జ్  మొరిగాడి శ్రీశైలం గౌడ్, భువనగిరి అసెంబ్లీ అధ్యక్షుడు బాసాని మహేందర్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి క్యాసని నవీన్ యాదవ్, భువనగిరి అసెంబ్లీ మహిళా కన్వీనర్ బాకారం లావణ్య,  ఆలేరు మండల అధ్యక్షుడుసంగి నవీన్,భువనగిరి మండల అధ్యక్షుడు సిలువేరు నర్సింగ్ రావ్, భువనగిరి పట్టణ అధ్యక్షుడు బర్రె నాగేష్, బోల్లేపల్లి అనిల్ కుమార్, పులి సంపత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.