కేంద్రప్రభుత్వ లబ్ధిదారులతో  మోదీ సమావేశం

దిల్లీ(జనంసాక్షి): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సంభాషించారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో వర్చువల్‌గా మాట్లాడిన ఆయన.. వారి నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది.కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి తాను లబ్ధి పొందానని జమ్మూ(ఏజీఎఎబీ)కు చెందిన సర్పంచ్‌ బల్వీర్‌ కౌర్‌.. ప్రధానికి తెలిపారు. కౌర్‌ మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న కొందరు కుర్చీ కోసం ఆమెను నెట్టడం ఆయన గమనించారు. దాంతో ఆమెను సరదాగా హెచ్చరించారు. ‘విూ కుర్చీ గట్టిగా పట్టుకోండి. లేకపోతే ఆమె(కౌర్‌ పక్కన ఉన్న మహిళను ఉద్దేశించి) కొత్త సర్పంచ్‌ అవుతారు’ అని చమత్కరించారు. ఆ తర్వాత తాను కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా ఒక ట్రాక్టర్‌ కొనుగోలు చేసినట్లు కౌర్‌ చెప్పగా.. ఆమె మాటలకు మోదీసంతోషం వ్యక్తం చేశారు.’విూకు ట్రాక్టర్‌ ఉంది. నాకు కనీసం సైకిల్‌ కూడా లేదు’ అని సరదాగా వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా మోదీ.. సంకల్ప్‌ యాత్ర ఉద్దేశాన్ని వెల్లడిరచారు. తాము లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకొని, మిగతా వారికి ఆ ఫలాలను అందించడమే తమ లక్ష్యమన్నారు.