కేంద్ర మంత్రి వాయలార్‌ రవిని కలిసిన కోదండరాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి వాయలార్‌ రవిని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కలిశారు. కేంద్రం తెలంగాణ అంశంపై త్వరగా తేల్చాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ నిర్ణయాన్ని కార్యచరణలో చూపెడతామని మంత్రి తెలియజేశారు. కోదండరాంతో పాటు పలువురు తెలంగాణ నేతలు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.