కేకే ఇంటి ముందు విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు ఇంటి ముందు తెలంగాణ న్యాయ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణపై ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష భేటికి పార్టీల నుంచి ఇద్దరిని పిలవడంపై వారు మండిపడ్డారు. తెలంగాణ అంశాన్ని నాన్చే దోరణితోనే కేంద్రం నాటకాలాడుతోందని విమర్శించారు. అఖిలపక్ష బేటికి పార్టీ అధ్యక్షులనే పంపాలని, ఈమేరకు కాంగ్రెస్‌ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.