కేజ్రీవాల్‌ తాజా లక్ష్యం ఎవరో ?

ఢిల్లీ : అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా ఎవరి గుట్టు విప్పబోతున్నారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు మొదలయ్యాయి. అంతకుముందు వరుసగా రాబర్ట్‌ వాద్రా, సల్మాన్‌ ఖుర్షీద్‌, నితిన్‌ గడ్కరీ, ముకేష్‌ అంబానీలకు సంబంధించిన కుంభకోణాలన కేజ్రీవాల్‌ బయట పెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజా లక్ష్యం అమర్‌సింగ్‌ అని మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. అమర్‌ ఉత్తర ప్రదేశ్‌లో రూ. 500 కోట్ల మేరకు అక్రమంగా సంపాదించారని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేస్తున్న త్రిపాఠి అనే వ్యక్తి ఇటీవల తనను కేజ్రీవాల్‌ మనుషులు సంప్రదించినట్లు చెప్పడాన్ని ఆ కథనాలు ఉటంకిస్తున్నాయి.