కేరళలో డీవైఎఫ్‌ఐ కార్యకర్త మృతి
తిరువనంతపురం: కేరళలో గురువారం సీపిఎం చేపట్టిన హర్తాళ్ సందర్బంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పార్టీ అనుబంధ విభాగమైన డీవైఎఫ్‌ఐ కాసర్‌గోడ్ జిల్లా అధ్యక్షుడు మనోజ్ కుమార్(24) మృతిచెందారు. పార్టీ సీనియర్ నాయకుడు పి.జయరాజన్ అరెస్టుకు నిరసనగా నిర్వహించిన హర్తాళ్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఉత్తర కేరళలోని చీక్నంలో నెలకొన్న ఘర్షణలో గాయపడిన మనోజ్ ఆసుపత్రిలో మృతి చెందారు. ముస్లిం లీగ్ కార్యకర్తల దాడిలోనే మనోజ్ మృతిచెందాడని డైవైఎఫ్‌ఐ నాయకులు ఆరోపిస్తూ శుక్రవారం బ్లాక్‌డేగా ప్రకటించారు. హర్తాళ్‌లో హింసకు బాధ్యులైన వారిపైనే చర్యలు తీసుకోవాలని సీఎం మెస్ చాందీ అధికారులను ఆదేశించారు. ఐయూఎంఎల్ యువజన కార్యకర్త అబ్దుల్ షుక్కూర్ హత్య కేసులో సీపీఎం కన్నూర్ జిల్లా కార్యదర్శి జయరాజన్‌ను అరెస్టు చేసిన విషయం విదితమే.