కేవీపీపై నాగం జనార్థన్‌రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావుపై నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం నెల రోజుల గడువు విధించగానే కేవీపీ తన కుట్రలను మొదలు పెట్టిండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 28న కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ను ఖతం చేయాలని పిలుపునిచ్చారు. సీమాంథ్రుల కుట్రలను తిప్పి కొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలని ఆయన అన్నారు.