కేశోరాం ఎన్నికల్లో గెలుపొందిన బయ్యపు మనోహర్ రెడ్డి
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా బయ్యపు మనోహర్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన ఎన్నికల్లో 263 ఓట్లకు గాను 263 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆటో గుర్తుపై పోటీ చేసిన బయ్యపు మనోహర్ రెడ్డికి 97 ఓట్లు రాగా, చేతిలో చేయి గుర్తుపై పోటీ చేసిన సూర సమ్మయ్య కు 85 ఓట్లు, ధర్మచక్రం గుర్తుపై పోటీ చేసిన నవీన్ కు 78 ఓట్లు రాగా మూడు ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో బయ్యపు రెడ్డి 12 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.