కేసీఆర్ వ్యాఖ్యలు మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే: తెదేపా
హైదరాబాద్: తెలంగాణ వస్తుందంటూ తెరాస అధినేత కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌తో పార్టీ చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి అమరవీరుల కుటుంబాల తెలుగుదేశం పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ అంశంపై కేంద్రానికి లేఖ ఇవ్వడానికి పార్టీ అధినేత చంద్రబాబు సుముఖంగా ఉన్నారని స్పష్టం చేశారు.