కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సాధించాలి

  – ఎంపీపీ గూడెపు శ్రీనివాస్
హుజూర్ నగర్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి): కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధించాలని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు కోరారు. మంగళవారం పట్టణంలోని మండల పరిషత్  కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజి  జయంతి  సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టి. శాంతకుమారి, ఎంపీ ఓ షేక్ మౌలానా, సి‌హెచ్ సాయిరాం , లక్కవరం ఎంపీటీసీ రణపంగు కాశమ్మ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area