కొనసాగుతున్న జూనియర్‌ వైద్యుల సమ్మె

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. అత్యవసర సేవలు నిలిపివేశారు., దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తే సమ్మె విరమణపై ఆలోచిస్తామని జూడాలు ప్రకటించారు. మంగళవారం నాడు వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడంటూ సాజిద్‌ఖాన్‌ అనే మృతుడు బంధువులు గాంధీ ఆసుపత్రిలో విధ్వంసం సృషించారు. దీంతో తమకు రక్షణ కల్పించేంతవరకూ సాధారణ, అత్యవసర సేవలు నిలిపివేస్తున్నట్లు జూడాలు ప్రకటించిర సంగతి తెలిసిందే.