కొల్లాపూర్‌ తెదేపా ఇన్‌ఛార్జి రాజీనామా

మహబూబ్‌నగర్‌: తెలుగుదేశం పార్టీ కొల్లాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జగదీశ్వర్రావు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపినట్లు ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తాను త్వరలో వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.