కోక్రాఝర్‌ బాధితులను పరామర్శించిన ప్రధాని

గౌహతి: కోక్రాఝర్‌ బాధితులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ రోజు పరామర్శించారు. వాతావరణం సరిగాలేక ఆయన హెలికాప్టర్‌ విమానాశ్రయంలో దిగలేకపోవటంతో వెనుకకు మళ్లి తిరిగి వచ్చారు. కొంతసేపటితరువాత మరో హెలికాఫ్టర్‌లో అస్సాం గవర్నర్‌ జేబీ పట్నాయక్‌ , ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌, అస్సాం కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు భువనేశ్వర్‌ కాలిటా, రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అనంతరం ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు తగిన న్యాయం చేస్తామని వారికి హామి ఇచ్చారు. ఈ హింసాత్మఖ ఘటనలు అత్యంత విషాదకరమని దేశానికే మచ్చ అని ఆయన అన్నారు. త్వరలో ఇక్కడ శాంతినెలకొంటుసదశ్రీని ఆశాభావం వ్యక్తం చేశారు.