కోదండరాంపై కేసుకు నిరసగా ర్యాలీ
మెదక్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై తెలంగాణ విద్యార్థి లోకం భగ్గుమంది. ఆయనపై అట్రాసీటి కేసు నమోదు చేసినందుకు నిరసనగా ఇవాళ జహీరాబాద్‌లో విద్యార్థి జేఏసీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి గీతారెడ్డిపై కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.