కోర్టులో హాజరైన రాందాస్‌… వారెంట్లు రద్దు

న్యూఢిల్లీ : అనినీతి కేసులో కేంద్ర అరోగ్య శాఖ మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి రాందాస్‌ మంగళవారం స్థానిక న్యాయస్థానంలో హాజరయ్యారు. దీంతో సీబీఐ న్యాయమూర్తి తల్వంత్‌సింగ్‌ ఈ నెల 7న ఆయనకు జారీ చేసిన బెయిలుకు వీలైన వారెంట్లను రద్దు చేశారు. సరిపడినంత మంది అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వైద్య కళాశాలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై రాందాస్‌ విచారణ ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానంలో హాజరైన ఆయన బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 20 లోగా సమాధానం ఇవ్వాలంటూ న్యాయస్థానం సీబీఐకి నోటీసులు జారీ చేసింది.