క్యాన్సర్‌ చిన్నారికి ఒసి-2 కార్మికుల వితరణ

ఖమ్మం, జూలై 10 : ఖమ్మం జిల్లా మణుగూరు మండల పరిధిలోని దమ్మక్కపేట గ్రామానికి చెందిన రాములు, రమణమ్మ దంపతుల కుమార్తె ప్రమిల క్యానర్‌వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలోని ఓసి-2 డంపర్‌ సెక్షన్‌ కార్మికులు స్పందించి చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం 11వేల రూపాయలను వితరణగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మణుగూరు ఏరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం నాయకులు పిచ్చేశ్వరరావు మాట్లాడుతూ క్యానర్‌తో బాధపడుతున్న చిన్నారికి కార్మికులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఇవ్వడం హర్షణీయమన్నారు. డంపర్‌ సెక్షన్‌ కార్మికుల సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. ముజాయుద్దీన్‌ ఆధ్వర్యంలో కార్మికుల నుండి సేకరించిన 11వేల రూపాయల నగదును ప్రాజెక్టు ఇంజనీర్‌ రామరాజు వారికి అందించారు.