క్రికెట్ టోర్నీలో గెలుపొందిన జట్టుకు బహుమతులు అందజేసిన ఎంపీపీ రాథోడ్ సజన్.

 

 

 

 

 

 

నెరడిగొండమార్చి8(జనంసాక్షి):క్రీడల్లో గెలుపోటములు సహజమేనని మండల ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.బుధవారం రోజున మండలంలోని బొందిడి గ్రామ యువకుల ఆహ్వాన మేరకు ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ రాథోడ్ సజన్ పాల్గొని ఈ క్రికెట్ టోర్నీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిని బుగ్గారామ్ జట్టుకి రెండవ బహుమతిని బొందిడి గ్రామ జట్టుకు వారి చేతుల మీదుగా అందజేశారు.వారు మాట్లాడుతూ క్రీడల వలన స్నేహ భావం పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుందని గ్రామీణ ప్రాంతాలలో యువకులు క్రీడలలో రాణించి రాష్ట్ర జాతీయస్థాయిలలో గుర్తింపు పొందలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోపాటు స్థానిక సర్పంచ్ ఆడే అనిత జనార్దన్ గోవింద్ రావు నాయక్ కారొబారి ఉత్తం రాథోడ్ సుభాష్ గ్రామ ప్రజలు యువకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.