క్షమాభిక్షకు తాజాగా సరబ్‌జిత్‌ దరఖాస్తు

న్యూఢిల్లీ:పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుడు సరబ్‌జిత్‌ సింగ్‌ క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్ధారీకి తాజాగా విజ్ఞాపన దాఖలు చేశారు.ఆగస్టు 14న దేశస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా అభ్యర్ధన దాఖలు చేసినట్లు సరబ్‌జిత్‌ తరపు న్యాయవాది అవాయిస్‌ షేక్‌ తెలిపారు.ఈ మేరకు ఆయన సరబ్‌జిత్‌ కుమార్తె స్వపన్‌దీప్‌కు ఈమెయిల్‌లో సమాచారం పంపారు.ఇటీవల తనను విడుదల చేసినట్లు ప్రచారం జరిగి ఆ తర్వాత కాదని వార్తలు రావడంతో నిరాశ చెందనట్లు సరబ్‌ పేర్కోన్నారని అందులో వెల్లడించారు.స్వపన్‌దీప్‌కు పంపిన మెయిల్‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయకట్టుకు కూడా పంపించారు.రాజస్థాన్‌ జైల్లో ఉన్న పాకిస్ధాన్‌ సీనియర్‌ శాస్త్రవేత్త ఖలీల్‌ ఛిస్తీని విడుదల చేసిన కేసులో జస్టిస్‌ కట్టు కీలక పాత్ర పొషించిన సంగతి తెలిసిందే.