క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి* -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, మార్చి 24 (జనం సాక్షి);
క్షయ వ్యాది నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలనీ , వ్యాధిని గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు.శుక్రవారం క్షయ వ్యాది నివారణ దినోత్సవం సందర్భంగా జోగులమ్మ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌక్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అద్వర్యం లో ప్రిన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, నివారణతో వ్యాధిని అదుపు చేయవచ్చని, నిర్మూలన దిశగా వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో టీబి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు వీలుగా ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు.వారం రోజులు జ్వరం, దగ్గు ఉన్నవారిని వెంటనే గుర్తించి ఆసుపత్రిలో రక్త, గళ్ళపరీక్షలు నిర్వహించి వారికి ఆరు నెలల లోపు వ్యాధిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతినెల (చికిత్స కాలం మొత్తం) 500/- రూపాయలు పోషణ భత్యం (పోషకాహారం తీసుకోవడం కొరకు) ఇస్తారని, దీనివల్ల టిబి వ్యాధిగ్రస్తులు చికిత్స కాలంలో మంచి పోషకాహారం తీసుకోవడం కొరకు ఈ పోషణ బత్యం ఉపయోగపడుతుందని తెలిపారు.టీ బి నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. 2025 సంవత్సరం నాటికి టీబి వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశాలకు టిబీ వ్యాధి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ప్రప్రంచ క్షయ వ్యాది దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ చేఇంచారు.
ఈసమావేశం లో డిఎంహెచ్వో డాక్టర్ శశికళ, డాక్టర్ సిద్దప్ప, స్రవంతి, మల్లికార్జున్, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఆశలు, ఏ ఎన్ ఎం లు తదితరులు పాల్గొన్నారు.