ఖాట్మండులో విమాన ప్రమాదం

19మంది దుర్మరణం
ఖాట్మండు, సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి): ఘోర విమాన ప్రమాదం ఖాట్మండులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదంలో 19మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌ రాజధాని అయిన ఖాట్మండు విమానాశ్రయం నుంచి లుక్లాకు ప్రైవేటు విమానం శుక్రవారం ఉదయం 19మందితో బయల్దేరింది. 19మందిలో 16మంది ప్రయాణీకులు కాగా.. ముగ్గురు విమాన సిబ్బంది. ఖాట్మండు విమానాశ్రయం నుంచి బయల్దేరిన రెండు నిమిషాలకే మనోహర నది సమీపంలో నేలకూలినట్టు అధికారులు ధృవీకరించారు. ఘటనాస్థలానికి చేరుకున్న విమానయాన సిబ్బంది,సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది.