గంజాయి తోటలపై దాడులు

మనూరు: మెదక్‌ జిల్లా మనూరు మండలంలోని మావినెల్లి పంచాయతీ పరిధిలో సక్రునాయక్‌ తండాలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. దీని విలువ మూడు కోట్లు ఉంటుందని ఎస్‌ఐ తెలియజేశారు. గ్రామాల్లో ఇంకా గంజాయి సాగుచేస్తున్న రైతుల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.