-->

గజవాడ పాఠశాలలో చోరీ

జనం సాక్షి /రేగోడ్ సెప్టెంబర్21:
విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలను అభివృద్ధి చేయాల్సింది పోయి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడుతున్నారు. ఈ సంఘటన రేగోడు మండలంలోని గజవాడ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తులు స్కూల్ తాళాలు పగలగొట్టి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు అపహరించినట్లు తెలిపారు. కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దీప్తిప్రసన్న స్థానిక ఎస్సై సత్యనారాయణకు తెలపడంతో, ఎస్ఐ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని కి చేరుకొని సిబ్బందితో కలిసి పాఠశాలను పరిశీలించారు.వీరి వెంట గ్రామ సర్పంచ్ అనిత మానెప్ప గ్రామ పెద్దలు ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్ ఫాతిమా, ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నర్సింలు ఉన్నారు.