గన్నవరంలో హోంమంత్రికి ఘనస్వాగతం
గన్నవరం: గుంటూరు జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంనేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం లభించింది. స్థానిక ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో గుంటూరుకు వెళ్లారు.