గాంధీల నాయకత్వంలోనే కాంగ్రెస్‌కు బలం

share on facebook

20న ఎల్లారెడ్డిలో మనవూను`మన పోరు
వెల్లడిరచిన కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ
కామారెడ్డి,మార్చి18  (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ గాంధీల నాయకత్వంలోనే బలంగా ఉంటుందని, వారికి త్యాగాలు చేసిన చరిత్ర ఉందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడు ఓడిపోయినంత
మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ సముద్రం లాంటిదని ఆటెపోట్లు సహజమన్నారు. సీనియర్లు కూడా ఈ విషయం గుర్తించి మసలుకుంటే మంచిదన్నారు. ఓటమికి కాంగ్రెస్‌ నాయకత్వం వైఫల్యం కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ బలంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం తమదేనని అన్నారు. కెసిఆర్‌ ప్రజావ్యతిరేక పాలనతో ప్రజలు విసిగి పోయారన్నారు. తెలంగాణలో రైతులకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్‌ ప్రయత్నమని అన్నారు. అందుకే టీ కాంగ్రెస్‌ ’మన ఊరు.. మన పోరు’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. రైతు సమస్యలపై ఈ మా పోరు ఆగదన్నారు. రాజకీయాల కోసం కాదు రైతుల సమస్య కొరకే తమ పోరాటమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతుల ధాన్యం కొనుగోలు చేయమని కేసీఆర్‌ వరి వేస్తే ఉరి అంటారని ఆయన విమర్శించారు. ప్రజలు రైతులు కలిసి కేసీఆర్‌కు, ప్రభుత్వం లోని మంత్రులకు ఉరి వేయాలని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఒకప్పుడు ఎక్కువ సమయం కేటాయించేవారు ఈ సంవత్సరం 11 రోజుల్లో ఖతం చేశారన్నారు. పోచారం స్పీకర్‌ అయ్యాక అసెంబ్లీలో చర్చలకు సమయం ఇస్తాడని అనుకున్నామని, కానీ అలా జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసిఆర్‌ కనుసన్నల్లో అసెంబ్లీ నడుస్తోంది.. సమస్యలపై నోరెత్తితే మా సభ్యుల మైక్‌ కట్‌ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్నింటికీ ఒకే ట్యాక్స్‌ ఉంటే బాన్సువాడ లో పోచారం కుటుంబం రెండు ట్యాక్స్‌ లు వసూలు చేస్తారని, పేదవాడు ఇళ్ళు కట్టుకుంటే ఇసుకకు ట్యాక్స్‌ లు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎల్లారెడ్డిలో 20న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు, ప్రజలు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పాల్గొన్నే మా ఊరు మా పోరు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.

Other News

Comments are closed.