గాలి బెయిలు కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిలు కుంభకోణం కేసులో అరెస్టైన హైకోర్టు రిజిస్ట్రార్‌ లక్ష్మీనరసింహారావు, మాజీ జడ్జి ప్రభాకరరావు, గాలి బంధువు దశరధరామిరెడ్డిల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈ రోజుతో రిమాండ్‌ గడువు ముగియడంతో చర్లపల్లి జైలు అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. బేయిలు కుంభకోణంలో లక్ష్మీనరసింహారావు, ప్రభాకరరావు, దశరథరామిరెడ్డిలు కీలకపాత్ర పోషించారని, బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశమున్నదున నిందితుల రిమాండ్‌ గడువును పొడింగించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. ముగ్గురు నిందితుల రిమాండ్‌ గడువును ఈ నెల 25వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.