గాలి బెయిల్‌ కేసులో మరో నిందితుడు అరెస్టు

తిరుపతి: గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారినికి సంబంధించిన మరో నిందితుడ్ని ఏసీబీ అరెస్టు చేసింది. గాలి జనార్థన్‌రెడ్డికి సమీప బంధువు అయిన దశరధరామిరెడ్డిఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు నిర్ధరణకు రావడంతో శుక్రవారం రాత్రి తిరుపతిలో అతన్ని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం దశరథరామిరెడ్డిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.