గిరిజనుడు రాష్ట్రపతి అయ్యే సమయం వచ్చింది:అరవింద్‌ నేతామ్‌

బోపాల్‌:ఒక గిరిజనుడు దేశానికి రాష్ట్రపతి కావాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్‌ బహిష్కృత నేత అరవింద్‌ నేతామ్‌(70) చెప్పారు.గిరిజన నేత పి.ఎ.సంగ్మాకు మద్దతు ప్రకటించి తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన శుక్రవారం పేర్కొన్నారు.సంగ్మాకు మద్దతు ప్రకటించినందుకు అరవింద్‌ నేతామ్‌ను గురువారం కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.గిరిజనుగడిని రాష్ట్రపతి ఎన్నుకొనేందుకు ఇదే సరైన సమయమని ఆయన తెలిపారు.గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.గిరిజన ఫొరమ్‌ ఆధ్వర్యంలో త్వరలో అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో సంగ్మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరతామని ఆయన వివరించారు.