గిరిజనులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి):
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ సిద్దార్థజైన్‌ తెలిపారు. ఈ నెల 6న వెంకటాపురం, 10న మణుగూరు, 17న చింతూరు, 24న బుర్గంపాడు పిహెచ్‌సిలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిబిరాలలో ఆయా పిహెచ్‌సిల వైద్యులు, సిబ్బంది అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వైద్య నిపుణులకు సహకరిస్తారని కలెక్టర్‌ వివరించారు. ఈలోగా చుట్టుపక్కల పిహెచ్‌సిలు మండలాల్లో వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందిపడుతున్న రోగులను గుర్తించి శిబిరాలకు తేవాలని ఆరోగ్య కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లను కలెక్టర్‌ ఆదేశించారు.