గిరిజన భూముల స్వాధీనానికే నూతన భూసేకరణ విధానం

విశాఖ: కోస్టల్‌ కారిడార్‌ నిర్ణాణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ సదస్సు ఆదివారం సాయంత్రం ముగిసింది. ఆదీవాసీ ప్రాంతాల్లో భూములను ఉద్యోగాలు ఎరచూపి గిరిజన రైతాంగం చేతుల్లోంచి లాక్కునేందకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆయన తెలిపారు. ఈసందర్భంగా బహిరంగసభలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.డి. శర్మ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం నూతన భూ సేకరణ చట్టం తీసుకురావాలని యోచిస్తోందని, అభివృద్ధి ప్రాజెక్టులకోసం సేకరించే భూమిలో 70శాతం భూమిని ఆయా కంపెనీలే సేకరించాలనే నిబంధనను ఇందులో పొందుపరిచేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని, దీనివల్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్వవసాయంలో వినియోగించాల్సి వస్తుందన్నారు. ఈ పరిస్థితి దున్నే వానికే భూమి నినాదానికి విఘాతం కలిగిస్తుందని విమర్శించారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.కృష్ణ, విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని ప్రసాద్‌, కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణ వ్యతిరేక కమిటీ కన్వీనర్‌ కె.ఎస్‌.చలం తదితరులు సభలో పాల్గొన్నారు.