గుండెపోటుతో సింగరేణి కార్మికుని మృతి

గోదావరిఖని: సింగరేణి కన్వేయర్‌ ఆపరేటర్‌గా పనిచేసే గుండెవేన యాదగిరి (56) మృతి చెందాడు. రాత్రి షిప్టు విధులు నిర్వహించిన యాదగిరి విధులు ముగిసే సమయంలో కిందికి దిగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు గుర్తించి ప్రథమ చికిత్స చేసేటప్పటికే మృతి చెందాడు.