గుజరాత్‌లో బీజేపీ హవా

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 182 స్థానాలకుగాను 113 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అందరు అనుకున్నవిధంగానే నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ దిశగా దూసుకువెళుతున్నారు. వరుసగా మూడోసారి నరేంద్రమోడీకి ఓటర్లు పట్టం కట్టారు. మణినగర్‌ నుంచి మోడీ శ్వేతాభట్‌పై 47 వేల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో కాబోయే ప్రధాని మోడీ అంటూ గుజరాత్‌ బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అటు దక్షిణ గుజరాత్‌లోనూ బీజేపీ హవా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.