గురజాల ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. పిడుగురాళ్ల సీఐ బి. శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా రెండురోజుల క్రితం స్టేషన్‌ ముందతన అనుచరులతో ఎమ్మెల్యే ఇందోళన చేశారు. సీఐపై విమర్శలు చేయడంతోపాటు అయన్ని కులం పేరుతో దూషించారు. దీంతో పిడుగురాళ్ల పోలీసులు ఎమ్మెల్యే యరవతినేని సహా మరో 27 మందిపై మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు.