గొల్లపల్లిలో గ్రామసభ సమావేశం.

నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ ఇందూరి శశికళ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈసమావేశంలో ఉపాధిహామీ పథకం ద్వారా పండ్ల మొక్కల పెంపకం, చేను గట్లపై కొబ్బరి చెట్ల పెంపకంపై గ్రామస్తులకు అవగాహనా కల్పించారు. పంచాయతీలో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈసమావేశంలో పంచాయతీ కార్యదర్శి మద్దివేణి రంజిత్, ఉప సర్పంచ్ జాడి నారాయణ, వార్డు సభ్యులు గంగమల్లు, శ్రీనివాస్, ప్రమోద్, ఉమాదేవి, ఉపాధిహామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.