గోటిచుట్టుపై రోకలి పోటు వంట గ్యాస్‌పై మళ్లీ వడ్డన

ఢిల్లీ: అక్టోబర్‌ 6 (జనంసాక్షి) :

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర శనివారం రూ.11.42 పెరిగింది. డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్‌ పెంపుదల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీలర్లకు లీటర్‌ పెట్రోల్‌పై కమిషన్‌ కనీసం 23పైసలు, లీటరు డీజిల్‌పై 10పైసల పెంపుదల అంశాన్ని చమురు మంత్రిత్వశాఖ పరిగణలోకి తీపుకోవటంతో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరగవచ్చు. 14.2కేజీల సిలిండర్‌ వంటగ్యాస్‌ డీలర్లకు ఇచ్చే కమిషన్‌ను రూ.25.83నుంచి రూ.37.25పైసలకు పెంచుతూ మంత్రిత్వశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసిందని ప్రభత్వ అధికారులు వెల్లడించారు. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.11.42పైసల దాకా పెరిగిన కమిషన్‌ భారం వినియోగదారులపై పడుతుందని వారు తెలిపారు.