గోడకూలి ఐదుగురు బాలల మృతి

న్యూఢిల్లీ: తూర్పు ఢీల్లీలో బుధవారం ఉదయం గోడ కూలటంతో ఐదుగురు బాలలు మరణించగా మరో బాలుడు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు.ఢిల్లీ శివారు డల్లూపూర్‌ గ్రామంలో ఉదయం 10.00 గంటలకు ఈదుర్ఘట జరిగింది.ఒక ఖాళీ ప్లాట్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. వీరంతా పదేళ్లలోపువారే. హటాత్తుగా ప్లాట్‌ను ఆనుకుని ఉన్న గోడ కూలటంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. సహాయక దళాలు వారని  ఆస్పత్రికి తీసుకువెళ్లినా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు.ప్లాట్‌ చుట్టూ ప్రహారీ గోడకడుతున్నారని ఇది ఒక మురుగుకాల్వకు పక్కనే ఉందని గోడ కూలటంతో పిల్ల్లలు మరణించారని అధికారులు తెలిపారు.