గ్యాస్‌ కేటాయింపులపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: విద్యుత్‌ కేద్రాలకు గ్యాస్‌ కేటాయింపుల విషయమై నిన్న అధికార ప్రకటన జారీచేసిన సీఎం ఇవాళ అధికారిక సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాజెక్టుకు ఎరువుల ప్రాజెక్టుకు ఎరువుల ప్రాధాన్యం కింద గ్యాస్‌ సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చిన తరహాలోనే నేదునూరు, శంకర్‌పల్లి కేంద్రాలకు గ్యాస్‌ సరఫరా చేయాలని మరోమారు కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాంతంలో 17 ఎత్తిపోతల పథకాలకు దాదాపు 6000మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉందని పొన్నాల తెలిపారు. నేదునూరు, శంకర్‌పల్లి కేంద్రాలకు గ్యాస్‌ సరఫరా ద్వారా 3100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగే అవకాశం ఉన్నందున సమస్య కొంతైనా తీరుతుందని ఆయన ఆభిప్రాయపడ్డారు.