గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వం
ఎంపీ బండి సంజయ్ కుమార్
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 10
మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నా ఎంపీ బండి సంజయ్ కుమార్
* శంకరపట్నం మండలంలో 33 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ
గ్రామాల మౌలిక వసతులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలిపారు.
శనివారం రోజున శంకరపట్నం మండలంలోని పాపయ్య పల్లె, లింగాపూర్ గ్రామాల్లో ఈజీఎస్ కింద మంజూరైన 33 లక్షల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మోడీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లోని అంతర్గత సిమెంట్ రహదారులు , మురికి కాలువలు ఈజీఎస్ నిధులతోనే చేపడుతున్నారని పేర్కొన్నారు . ఈజీఎస్ నిధులతో మండలంలోని పాపయ్యపల్లిలో 20 లక్షల నిధులతో లింగాపూర్ లో13 లక్షల నిధులతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు శనివారం రోజున శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించినట్లు ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.
బిజెపిలో 100 మంది చేరిక:
శంకరపట్నం, సైదాపూర్ మండలం లోని వివిధ పార్టీలకు చెందిన పలువురు కేశపట్నం మండల అధ్యక్షుడు ఐలయ్య, సైదాపూర్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దాదాపు 100 మందికి పార్టీ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఇట్టి కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి, గుర్రాల వెంకటరెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు , జిల్లా అధికార ప్రతినిధులు అలివేలు సమ్మిరెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్ర , మీడియా కన్వీనర్ కటకం లోకేష్ ,మాడుగుల ప్రవీణ్, కేశపట్నం ఎంపీటీసీ అనిల్, మండల అధ్యక్షుడు ఐలయ్య, తిమ్మాపూర్ ,సైదాపూర్ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి, శ్రీనివాస్ రెడ్డి,
దండు కొమురయ్య , నాయకులు జయచందర్ కేశపట్నం బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .