గ్రూపు-1 జనరల్‌ ఇంగ్లీష్‌ పరీక్ష వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 16న జరగాల్సిన గ్రూపు-1 జనరల్‌ ఇంగ్లీష్‌ పరీక్షను సెప్టెంబర్‌ 28 కి ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ కొత్త హాల్‌టికెట్లు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.ఈ నెల 23న జరగాల్సిన ముస్సిపల్‌ ఇంజినీర్స్‌ రాతపరీక్ష  నవంబర్‌ 3కు వాయిదా వేశారు. ఈ నెల 24న జరాలాల్సిన మున్సిపల్‌ అకౌంటెంట్‌ రాతపరీక్ష నవంబర్‌ 4కు వాయిదా వేశారు. ఈ నెల 28న జరగాల్సిన డీగ్రీ లెక్చరర్స్‌ ఇంటర్వ్యూలు, సెప్టెంబర్‌ 17 జరగాల్సిన పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌  ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. పాలిటెక్నిక్‌, డిగ్రీ లెక్చరర్ల ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ అధికారులు తెలియజేశారు.