గ్రూపు-2 వైట్‌నర్‌ వివాదంపై తీర్పు వెల్లడి

హైదరాబాద్‌: గ్రూపు-2 వైట్‌సర్‌ వివాదంపై రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది. ఇంటర్వూలు ముగిసినా తుది ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష పత్రంలో వైట్‌సర్‌ వినియోగించిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈకేసును రెండు నెలల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.