గ్రూప్‌-1 మెయిన్స్‌కి ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌: సెప్టెంబరు 3 నుంచి జరిగే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలియజేశారు. 314 పోస్టులకు 16,426 మంది పరీక్ష రాస్తున్నారని, ఓఎంఆర్‌ షీట్‌లో అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం ముద్రించామని పూనం మాలకొండయ్య తెలియజేశారు.