గ్రూఫ్‌-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌ : గ్రూఫ్‌-2 పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో గ్రూఫ్‌-2 పరీక్ష ప్రారంభం కానుంది. మొత్తం 781 పోస్టులకు గాను 5 లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1360 పరీక్షా కేంద్రాలను ఊర్పాటు చేశారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంటముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ రోజు మద్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు పేపరు -1 పరీక్ష జరుగతుంది.