గ్వాటిమాలాలలో భూకంపం : 48 మంది మృతి

శాన్‌మార్కోస్‌, గ్వాటిమాలా : మధ్య అమెరికాలోని గ్వాటిమాలా దేశంలో బుధవారం సంభవించిన భూకంపంలో 48 మంది చనిపోయారు. మరో వంద మంది ఆచూకీ తెలియడం లేదు. ఇది కాక ఇంకా వందల మందికి గాయాలయ్యాయి. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమైదైంది. బుధవారం ఇక్కడి స్థానిక సమయం 10.35 గంటలకు అందరూ తమ తమ పనుల్లో మునిగి ఉండగా భూకంపం సంభవించింది. దేశంలోని 22 రాష్ట్రాల్లో ఒక్కటి తప్పితే అన్నింటిలోనూ కొద్దో,గొప్పో నష్టం ఏర్పడింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో నష్టం తీవ్రం ఉంది. భయంతో అరుస్తూ పౌరులు వీధుల్లోకి వచ్చారు. కొండచరియలు విరిగిపడి హైవేల మీద పడ్డాయి. పొరుగున ఉన్న మెక్సికోలో కూడా దీని ప్రభావం కనిపించింది.