ఘనంగా జేఎన్‌టీయూకె 4వ ఆవిర్భావ దినోత్సవం

బాలాజీచెరువు(కాకినాడ): తూ.గో జిల్లా కాకినాడ జేఎస్‌టీయూకే 4వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో విప్రో జనరల్‌ మేనేజర్‌ అకౌంట్‌ డెలివరీ హెడ్‌ సూర్యప్రకాష్‌ తమ్మిరాజు మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా విద్యలో పెనుమార్పులు తీసుకురావచ్చన్నారు. విద్యార్థులు ఇంటర్నెట్‌ ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సముపార్జించలచ్చన్నారు. కార్యక్రమంలో జేఎస్‌టీయూకే ఉపకులపతి  తులసీ రాందాస్‌ మాట్లాడుతూ ఏఎస్‌టీయూలో అంతర్జాతీయ విద్యను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ సత్యప్రసాద్‌, రిజిస్టార్‌ ఈవీ ప్రసాద్‌, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.