చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం..

కరీంనగర్‌,జూలై 14(జనంసాక్షి): టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను శనివారం స్థానిక తెలంగాణ చౌక్‌లో తెలంగాణ వాదులు దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులను ఎన్‌కౌంటర్‌ చేయించిన ఘనత బాబుదే నని, తెలంగాణ ప్రజలు ఎవరు ఆ పార్టీని నమ్మరని తెలిపారు. రైతు సమస్యలను విస్మరించిన చంద్రబాబు, నేడు మొసలి కన్నీరు కారుస్తు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, తెలంగాణకు మొదటి ద్రోహి చంద్రబాబేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్‌, లింగంపెల్లి సత్యనారాయణ, పల్లె నారాయణ గౌడ్‌, గొడిశెల సతీష్‌గౌడ్‌, తూల సంజీవరావు, జి అనిల్‌, రామయ్య, హుస్సేన్‌, జమీల్‌, మోతి వీరయ్య, ఎన్‌ విద్యాసాగర్‌, బి లింగయ్య, నారాయణ, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

తాజావార్తలు