చంద్రాబును అడ్డుకోవడం పై లగడపాటి సమాధానం చెప్పాలి

విజయవాడ:  దుర్గగుడి వద్ద భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనేదే తెదేపా ప్రయత్నమని ఆపార్టీ నేత నన్నపనేని రాజకుమారి చెప్పారు.దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం కోరుతూ చంద్రబాబు చేపట్టిన మహాధర్నాలో ఆమె ప్రసంగించారు. తెదేపా ప్రభుత్వంలో రాష్ట్రంలో     చాలాప్రాంతాల్లో ప్లైఓవర్లు నిర్మిచారని  తెలిపారు. మహాధర్నా  చేపట్టిన చంద్రబాబును అడ్డుకోవడం పై లగడపాటి రాజగోపాల్‌ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ దారి మళ్లింపుపై పోలీసులు క్షమాపణ చెప్పాలని కోరారు.