చంపుతామనడం మా వద్ద మామూలు మాటే

వివరణలో సీమ సంస్కృతిని చాటిన టీజీ
హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి వెంకటేశ్‌ వివరణ ఇచ్చుకున్నారు. చంపుతామనడం మా ప్రాంతంలో సాధారణమేనని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై అధికారులు పట్టించుకోకపోవడంతో కోపంతో తాను ఆ మాట అనాల్సి వచ్చిందని తెలిపారు. రైతులు తాము ఆత్మహత్యలు చేసుకుంటామని అనడంతో మీరెందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. చేసుకుంటే మేం చేసుకోవాలి, లేదా అధికారులు చావాలి అని అన్నట్టు చెప్పారు. అధికారులను కాల్చుతామని భయపెడితే వారు సక్రమంగా పనిచేస్తారని మంత్రి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అదికారులు తమ తప్పులు తాము తెలుసుకుని సక్రమంగా పనిచేస్తామంటే వారికి క్షమాపణ చెప్పటానికి తాను సిద్ధమని తెలిపారు.