.చరిత్రను పది కాలాలు పదిల పరిచేది పుస్తకం.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు29
చరిత్రను పది కాలాల పాటు పదిల పరిచేది పుస్తకమే అని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తెలంగాణ సాహిత్య కళాపీఠం వ్యవస్థాపాక అధ్యక్షులు జంగిటి శాంత కుమారి ఆధ్వర్యంలో పలువురు కవులు రచించిన”తన్నీరుకు కవితా పన్నీరు”కవిత సంకలనం,అక్షరశిల్పం పుస్తకాలను సిద్ధిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.మనభావాలను ప్రజలకు చేరవేయడంలో కవుల కృషి ఎనలేనిదని కొనియాడారు.పుస్తక ఆవిష్కరణలో ల్కాజిగిరి ప్రాంతానికి చెందిన యువ కవి తులసి వెంకట రమణా చార్యులు పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.
రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి మెలసి ఉండే వ్యక్తి తన్నీరు హరీష్ రావు,వారి వ్యక్తిత్వం గురించి అక్షర రూపంలో కవితా సంపుటిలో అక్షర పన్నీరు జల్లినట్టు అని అన్నారు.అనంతరం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా తులసి వెంకట రమణా చార్యులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.