చిన్నరెడ్డి అరెస్టుని నిరసిస్తూ పార్టీ శ్రేణుల అందోళన

నల్గొండ: నాగార్జునసాగర్‌ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి తేరా చిన్నపరెడ్డి అరెస్టునిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనతో వాహన రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. రెండు కిలోమీటర్లు వరకు వాహనాలు నిలిచిపోయాయి. జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణం చిన్నపరెడ్డిని విడుదల చేయకపోతే ఆందోళణలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.