చిన్నారి చూపుపై నేడు వీడియో కాన్ఫరెన్స్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ: చిన్నారి చూపు కార్యక్రమంపై బుధవారం ఉదయం 10.30కు వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని ఆర్వీఎం పీవో కె.సీతారామరావు తెలిపారు. బడిబయటి పిల్లల ఆన్‌లైన్‌ నమోదు, వివరాల తనిఖీపై మార్గదర్శకాలను వివరిస్తారని తెలిపారు.